: అభిమానుల తీరుతో షాక్ కు గురైన సమంత
తమిళ భామ సమంత సొంత రాష్ట్రంలో అభిమానుల తీరుతో షాక్ కు గురైంది. తమిళనాట సినీ నటులపై అభిమానం ఒకింత ఎక్కువేనని మరోసారి మధురై అభిమానులు నిరూపించారు. తమిళనాట 'తెరి'తో మంచి విజయం అందుకున్న సమంత మధురైలో ఓ షాపు ప్రారంభోత్సవానికి హాజరైంది. దీంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సమంత రావడంతో అభిమానుల్లో తోపులాట మొదలైంది. ఈ సందర్భంగా సమంతను ఇంకొంత సేపు అక్కడ ఉంచాలనే ఉద్దేశంతో ఓ అభిమాని ఆమె కారు టైరును పంక్చర్ చేశాడు. దీంతో అభిమానులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక పరుగందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో సమంత షాక్ కు గురైంది.