: హైకోర్టు విభ‌జ‌న అంటూ కేసీఆర్ కొత్త వివాదం లేవ‌నెత్తారు: మ‌ంత్రి కామినేని


హైకోర్టు విభ‌జ‌న అంశంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆంధ్రప్ర‌దేశ్ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ అన్నారు. ఈరోజు మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. అమరావతిలో హైకోర్టుకి స్థలం ఇప్ప‌టికే కేటాయించామ‌ని పేర్కొన్నారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ వివాదాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే కేసీఆర్ కొత్త వివాదం లేవ‌నెత్తారని ఆయ‌న ఆరోపించారు. ‘కేసీఆర్ త‌న చేతిలో ప‌రిష్క‌రించ‌డానికి ఉన్న విష‌యాల గురించి మాట్లాడ‌బోరు.. కానీ వేరే అంశాల‌పై న్యాయం అంటూ మాట్లాడ‌తారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ప్రాంతీయ వివాదాల్లోకి లాగ‌డం భావ్యం కాదని కామినేని అన్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News