: తెలంగాణ‌లో కాంట్రాక్టుల‌న్నీ ఆంధ్రావారికే వెళుతున్నాయి: ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి


తెలంగాణ‌లో కాంట్రాక్టుల‌న్నీ ఆంధ్రావారికే వెళుతున్నాయని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో మీడియాతో ఆయ‌న‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అస‌త్య ప్ర‌చారాల‌తో టీఆర్ఎస్ నేత‌లు త‌మ పార్టీపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. భూనిర్వాసితుల అంశంపై ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News