: మధ్యప్రదేశ్ యూనివర్సిటీ మాయాజాలం... 450కి 727 మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని!
బీహార్ లో వెలుగు చూసిన టాపర్స్ స్కాం గుర్తుండే ఉంటుంది. అక్షరం ముక్క రానివారిని టాపర్లుగా ప్రకటించిన బీహార్ విద్యాశాఖ చెడ్డపేరును మూటగట్టుకుంది. మధ్యప్రదేశ్ లో దానిని మించిన నిర్వాకాన్ని ఓ యూనినివర్సిటీ చేసింది. ఎంపీలో అవధేశ్ ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయంలో (ఏపీఎస్యూ) శిఖా త్రిపాఠీ అనే యువతి బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎకనామిక్స్ పేపర్లో 100 మార్కులకు ఆమె ఏకంగా 525 మార్కులు స్కోరు చేసింది. గ్రూపులోని అన్ని పరీక్షలు రాసిన శిఖా త్రిపాఠీకి మొత్తం 450 మార్కులకు గాను 727 మార్కులు వచ్చాయి. అంటే, పరీక్ష నిర్వహించిన మొత్తం మార్కులకు మించి 161% మార్కులు రావడంతో నేరుగా రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేయగా, కంప్యూటర్ తప్పిదం కారణంగా ఇలా జరిగిందని సమాధానమిచ్చారు.