: హైదరాబాద్ ను ప్రమాదరహిత నగరంగా చేయాలని కంకణం కట్టుకున్నాం: సీపీ మహేందర్ రెడ్డి


హైదరాబాద్ ను ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నామని నగర పోలీస్ కమిషన్ సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ భద్రతపై ఈ రోజు హైదరాబాద్, రవీంద్రభారతిలో అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రహదారి భద్రతపై విద్యార్థులు, పాఠశాల యాజమాన్యాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని, రహదారి భద్రతపై పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కుటుంబం, పాఠశాల నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ కిషన్, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News