: సుప్రీంకోర్టు కీలక తీర్పు... ఏపీ, టీఎస్ లకు వేర్వేరుగా గ్రూప్ -1 పరీక్షలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రూప్ - 1 పరీక్షల నిర్వహణ విషయంలో నెలకొన్న వివాదంలో సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక తీర్పిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ఏపీపీఎస్సీ ద్వారా, తెలంగాణకు టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షల ప్రక్రియనంతా మూడు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంది. కాగా, గ్రూప్-1 నోటిఫికేషన్ 2011లో వెలువడగా, అప్పటి నుంచి వేలాది మంది అభ్యర్థులు పరీక్షల కోసం వేచి చూస్తున్నారు. ఇక ఆనాటి పాత సిలబస్ ఆధారంగా తెలంగాణ పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే ఆదేశాలు ఏపీకీ వర్తిస్తాయని వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ -1 పరీక్షలకు మార్గం సుగమమైనట్లయింది

  • Loading...

More Telugu News