: రంగంలోకి దిగిన కుంబ్లే!... టీమిండియా హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతల స్వీకరణ


టీమిండియా హెడ్ కోచ్ గా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కొద్దిసేపటి క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీమిండియా కోచ్ పదవి కోసం ఇటీవల జరిగిన సుదీర్ఘ కసరత్తులో భాగంగా అనూహ్యంగా బరిలోకి దిగిన కుంబ్లే హెడ్ కోచ్ పదవిని ఎగురవేసుకుపోయారు. కుంబ్లే ఇచ్చిన ప్రజెంటేషన్ కు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఫిదా అయిపోయింది. దీంతో ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన కనబరచిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్ టామ్ మూడీని కాదని కుంబ్లేకే కోచ్ పగ్గాలు అప్పగించాలని సిఫారసు చేసింది. నేటి ఉదయం కోచ్ గా బాధ్యతలు చేబట్టిన కుంబ్లే... కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోరాట పటిమను సముపార్జించుకోవాలని ఈ సందర్భంగా ఆయన టీమిండియా జట్ల సభ్యులకు సూచించారు.

  • Loading...

More Telugu News