: హైదరాబాదులో పట్టుబడ్డ ఐఎస్ ఉగ్రవాదులు వీరే!
భాగ్యనగరిలో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పేర్లు వెల్లడయ్యాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో 13 మంది ఉగ్రవాదుల్లో ఆరుగురి పేర్లు వెల్లడయ్యాయి. ఈ ఆరుగురిని మహ్మద్ ఇలియాస్, ఇబ్రహీం, అబ్దుల్లా ఆల్మోడి, అబీన్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫానీ, ముజఫర్ గా పోలీసులు గుర్తించారు. ఇక మిగిలిన ఏడుగురి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాదులో విధ్వంసానికి పథక రచన చేసిన ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే రంగంలోకి దిగారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిన్న పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, భవానీ నగర్, మొఘల్ పురా, మీర్ చౌక్, తలాబ్ కట్టా, బార్కస్, హఫీజ్ బాబా నగర్, షాలిబండ, హుస్సేనీ ఆలం తదితర ప్రాంతాల్లోని 15 ఇళ్లను చుట్టుముట్టి ఈ 13 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నగరంలోని రహస్య ప్రాంతానికి తరలించిన వీరిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.