: 7వ వేతన సంఘం సిఫార్సులను మించి కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం... బేసిక్ పై 16 శాతం పెంపుదలకు క్యాబినెట్ ఓకే


ఏడో వతన సవరణ సంఘం చేసిన సిఫార్సులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పలికింది. కోటి మందికి పైగా కేంద్ర సంస్థల్లోని ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం కలిగేలా మూల వేతనాన్ని (బేసిక్) 16 శాతం పెంచేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జీతాల పెంపు అమలవుతుందని పేర్కొంది. బకాయిలను త్వరలోనే ఉద్యోగులకు అందిస్తామని వెల్లడించింది. ఈ సిఫార్సులపై కార్యదర్శుల బృందం ఇచ్చిన నివేదికను కూలంకుషంగా పరిశీలించి చర్చించిన మంత్రివర్గం, సిఫార్సులకు ఆమోదం పలికింది. మూలవేతనాన్ని 14.2 శాతం పెంచాలని పీఆర్సీసీ సిఫార్సు చేయగా, ఇంకాస్త కనికరం చూపుతూ 16 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దేశంలో 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు కేంద్ర సంస్థల్లో విధుల్లో ఉండగా, మరో 53 లక్షల మంది పదవీ విరమణ చేసి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. తాజా క్యాబినెట్ నిర్ణయంతో వీరు తీసుకుంటున్న వేతనాలు, పింఛన్లు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం పొందుతున్న వేతనం, పెన్షన్ తో పోలిస్తే, వీరు ఇకపై 25 శాతం అధికంగా పొందనున్నారు.

  • Loading...

More Telugu News