: యువతులు ప్రపోజ్ చేసిన వేళ, తప్పించుకునేందుకు చాలా మంది కుర్రాళ్లు చెప్పే కారణాలివే!
మగువ తానంతట తానుగా వలచి వస్తే... అంతకన్నా ఆనందం ఉండదు. వాస్తవానికి తన మనసుకు నచ్చిన వ్యక్తికి, తానే స్వయంగా ప్రపోజ్ చేయాల్సివస్తే... ఓ అమ్మాయికి ఇది అంత సులువేమీ కాదు. ఇక అతనే సర్వస్వమనుకున్న వేళ, బయటపడి పోతుంది. ఇదే సమయంలో యువకుల్లో కొందరు, ఆ ప్రతిపాదనకు వెంటనే ఎగిరి గంతేస్తారు. ఇదే సమయంలో మరికొందరు ఆ బంధాన్ని వద్దనుకుంటారు. యువతులు ప్రపోజ్ చేసిన వేళ, తప్పించుకునేందుకు మగవారు చెప్పే టాప్ కారణాలు ఇవేనట. * నువ్వు నాకో మంచి స్నేహితురాలివి. నేను ఏనాడూ ఆ దృష్టితో నిన్ను చూడలేదు. * నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇప్పట్లో వివాహబంధంలోకి వెళ్లలేను. సారీ! * నువ్వో మంచి అమ్మాయివి. నువ్వు నాపై చూపేంత ప్రేమను నేను చూపలేను. * నా భవిష్యత్తును నేనింకా నిర్ణయించుకోలేదు. కాబట్టి ఇప్పట్లో పెళ్లి ఉద్దేశం లేదు. * నా తల్లిదండ్రులే నాకు ఓ అమ్మాయిని చూస్తారు. వారి అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లలేను. * నేనింకా ఆర్థికంగా స్థిరపడలేదు. ఇప్పటికిప్పుడు నీ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేను.