: అసలు తెలంగాణలో ఇప్పుడు జేఏసీ లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ ధనిక రాష్ట్రమైనా ఛార్జీలు పెంచక తప్పదని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఓ తెలుగు టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎంత వీలయితే అంత తక్కువగా ఛార్జీలు పెంచాలనుకున్నాం.. అదే చేశాం..’ అని అన్నారు. రాజకీయ పార్టీల విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. ‘ప్రతీ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచాలని రూల్ చేసింది చంద్రబాబు నాయుడు.. ఇక కాంగ్రెస్ పార్టీ పాలనలో పెరిగిన ఛార్జీల గురించి తెలిసిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో కుట్రలు జరుగుతున్నాయని, అందుకే టీఆర్ఎస్‌లో ఆ పార్టీల నేతలు చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీ ప్రభుత్వంపై చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించిన జగదీశ్.. ‘అసలు తెలంగాణలో జేఏసీ లేదు’ అని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జేఏసీ ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.