: రేపే కేంద్ర కేబినెట్ విస్తరణ!... అశోకా హాల్ లో ఏర్పాట్లు షురూ!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లోని అశోకా హోటల్ లో జరుగుతున్న ఏర్పాట్లను ప్రస్తావిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. రేపు మధ్యాహ్నానికి ముందు కేబినెట్ విస్తరణకు మోదీ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారని ఆ పత్రిక తెలిపింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సహా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలను కొత్తగా కేబినెట్ లోకి తీసుకునేందుకు మోదీ కార్యరంగాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News