: ఆయన చెప్పాడు, నేను చంపాను: బాహుబలిని చంపడంపై కట్టప్ప
తన 38 సంవత్సరాల సినీ జీవితంలో 200 చిత్రాల తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారానని, కొన్ని వందల సినిమాల తరువాత చేసిన 'బాహుబలి' తెచ్చిన పేరు మరే చిత్రమూ తేలేదని నటుడు సత్యరాజ్ వ్యాఖ్యానించాడు. ఆయన తన కుమారుడు శిబిరాజ్ తో కలిసి నటించిన 'దొర' చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాహుబలిలో కట్టప్ప వంటి పాత్ర జీవితంలో ఒకసారే వస్తుందని, 'బాహుబలిని ఎందుకు చంపారు?' అన్న ప్రశ్నను తాను ఎన్నోమార్లు ఎదుర్కొన్నానని, దీనికి సమాధానంగా 'రాజమౌళి చెప్పాడు, నేను చంపాను' అని చెబుతానని అన్నారు. తదుపరి భాగంలో తన పాత్ర మరింత అలరిస్తుందని అన్నాడు. రెండు దయ్యాల మధ్య జరిగే కథతో 'దొర' చిత్రం తయారైందని అన్నాడు. తెలుగులో విజయవంతమైన 'పటాస్' రీమేక్ ను తమిళంలో తీస్తున్నారని, సాయికుమార్ చేసిన పాత్రను తాను చేస్తున్నానని చెప్పాడు.