: విశాఖ మేయర్ పీఠం మాదే: మంత్రి గంటా ధీమా
విశాఖ మేయర్ పీఠం తమదేనని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా టీడీపీకి చెందిన వ్యక్తే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని ఆయన తెలిపారు. రెండు పార్టీల వారికి ఆమోదయోగ్యమైన వ్యక్తినే మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. మేయర్ పీఠం తమదేనని, అందులో ఎలాంటి సందేహం వద్దని ఆయన మరోసారి స్పష్టం చేశారు.