: ప్రకాశం జిల్లా ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉంటారు: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
ప్రకాశం జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. దొనకొండ వద్ద పరిశ్రమ ఏర్పాటుకు చైనా అసోసియేషన్ స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజస్ తో సీఎం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారని, ఈ ప్రాజెక్టు ద్వారా నలభై వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే వీలుందన్నారు. చైనా కంపెనీతో ఈ ఒప్పందం చేసుకోవడం గర్వించదగ్గ విషయమని జనార్దన్ రావు అన్నారు.