: ఆ జిల్లాలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి... లేకపోతే ‘రేషన్’ కట్!


హర్యానా లోని భివాని జిల్లాలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా చూసేందుకు అక్కడి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు ఉండాలని లేనిపక్షంలో రేషన్ సరుకులు పంపిణీని నిలిపివేస్తామని వెల్లడించింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం నిమిత్తం గ్రామాలకు బోనస్ నిధులు కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా భివాని జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గటా మాట్లాడుతూ, సెప్టెంబరు నాటికి మరుగుదొడ్డిలేని ఇంటికి రేషన్ నిలిపివేయాలని గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 26 గ్రామ పంచాయతీల్లోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నాయని, మిగతా గ్రామాల్లో కూడా త్వరలోనే నిర్మించనున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News