: న్యాయవాదుల ఆందోళనకు మద్దతిస్తున్నాం: టీపీసీసీ
న్యాయవాదుల ఆందోళనకు తాము మద్దతిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కేంద్రం సుప్రీంకోర్టుని సంప్రదించి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి డిమాండ్ చేశారు. జడ్జీలపై సస్పెన్షన్‌ను తొలగించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. హైకోర్టు విభజన అంశంపై నిర్లక్ష్యధోరణి పనికిరాదని అన్నారు. కేంద్రం, సుప్రీం జోక్యం చేసుకొని హైకోర్టు ఏర్పాటుకు చొరవచూపాలని వారు డిమాండ్ చేశారు.