: చైనా వస్తువులను ఎవరూ కొనుగోలు చేయవద్దు: స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపు
ఎన్ఎస్జీలో భారత్ చేరికకు మోకాలడ్డిన చైనాకు వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ్ మంచ్ ఢిల్లీలో ఆందోళన నిర్వహించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన సందర్భంగా చైనా వస్తువులను భారత్ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు నెలల పాటు భారతీయులంతా చైనా వస్తువులను కొనుగోలు చేయడం మానేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ఆందోళనకారులు దూసుకురావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.