: భూనిర్వాసితుల‌కు ప‌రిహారం ఇచ్చాకే ప్రాజెక్టును పూర్తిచేయాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్


తమకు అన్యాయం జరుగుతోందని మల్ల‌న్నసాగ‌ర్ భూనిర్వాసితులు ఆందోళ‌న చేస్తోన్న అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ స్పందించారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టులకు త‌మ‌ పార్టీ వ్యతిరేకం కాదని స్ప‌ష్టం చేశారు. అయితే, భూనిర్వాసితుల‌కు ప‌రిహారం ఇచ్చాకే మ‌ల్ల‌న్నసాగ‌ర్‌ ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆయ‌న సూచించారు. భూనిర్వాసితుల ఆవేద‌న‌ను ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాలని ఆయ‌న అన్నారు. వారి ఆందోళ‌న ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. న‌దీజ‌లాల వినియోగం పూర్తిస్థాయిలో జ‌ర‌గాలని ఆయ‌న ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News