: మద్యం మత్తులో ముంబై యువతి వీరంగం!... ఠాణాలో బూతు పురాణం, ఖాకీలకు చెంపదెబ్బలు!


మద్యం మత్తు తలకెక్కిన ఓ ముంబై యువతి పోలీస్ స్టేషన్ సాక్షిగా వీరంగమాడింది. నిన్న రాత్రి నలుగురు మగ స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించిన సదరు యువతి... అదే మత్తులో కారు స్టీరింగ్ ముందు కూర్చుని ర్యాష్ డ్రైవింగ్ తో రోడ్డు మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఓ వాహనాన్ని ఢీకొట్టిన ఆ యువతి... కారును ఆపకుండా ముందుకు సాగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటబడి ఆమెను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసలు కథంతా అక్కడే మొదలైంది. 'నన్నే అరెస్ట్ చేస్తారా?' అంటూ పోలీస్ స్టేషన్ లో బూతు పురాణం మొదలుపెట్టిన ఆ యువతి... అక్కడ కుర్చీల్లో కూర్చున్న ఆరుగురు పోలీసులను వరుసగా చెంప దెబ్బలు కొట్టింది. అసలే యువతి, ఆపై మద్యం మత్తులో ఉంది... నిలువరించేదెలాగంటూ పోలీసులు నానా పాట్లు పడ్డారు. ఒకానొక సందర్భంలో ఆ యువతి నుంచి దెబ్బలు తప్పించుకునేందుకు పోలీసులు స్టేషన్ లోనే పరుగులు పెట్టారు. ఇక ఆమెను నిలువరించేందుకు రంగంలోకి దిగిన ఆమె నలుగురు స్నేహితులు ఎలాగోలా ఆమెను శాంతింపజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానెళ్లలో ప్రధానంగా ప్రసారమవుతోంది.

  • Loading...

More Telugu News