: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల రాద్ధాంతం ఎందుకు..?: గుత్తా సుఖేందర్‌రెడ్డి
మల్లన్న సాగర్‌పై కాంగ్రెస్ నేతల రాద్ధాంతం ఎందుకని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. నల్గొండలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకి నీరందించే కార్యక్రమం చేపట్టిందని, దీని వల్ల 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మల్లన్నసాగర్‌పై విమర్శలు చేయడమేంటని ఆయన దుయ్యబట్టారు. పులిచింతలతో తెలంగాణలో ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని, అటువంటి ప్రాజెక్టుకు సహకరించిన నేతలు మల్లన్న సాగర్‌ను అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ న్యాయాధికారులు తమ డిమాండ్లపై రోడ్డెక్కడం పట్ల గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే సమస్యల పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారులను తొలగించిన అంశంపై హైకోర్టు మరోసారి ఆలోచించాలని ఆయన అన్నారు.