: పీవీ నరసింహారావును తలచుకున్న ప్రధాని మోదీ
మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావు 95వ జయంతి వేడుకల వేళ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన్ను గుర్తు చేసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. "పీవీ నరసింహారావు జయంత్యుత్సవాల వేళ, ఆయనకు నివాళులు. క్లిష్ట పరిస్థితుల వేళ ఆయన దేశాన్ని నడిపించారు. ఆయన నాయకత్వ లక్షణాలు ఎన్నదగినవి" అని ట్వీట్ చేశారు. కాగా, 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా పనిచేసిన పీవీ, ఆర్థిక సంస్కరణల అమలుకు ఎంతో కృషి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది నుంచి, హిందీయేతర భాష స్వభాషగా ఉన్న వ్యక్తిగా తొలిసారి ప్రధాని పదవిని అలంకరించిన ఘనత ఆయనకు దక్కింది. అప్పటి ఆర్థికమంత్రిగా, తదుపరి ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ తో కలిసి, దేశంలో పారిశ్రామికీకరణను మరో మెట్టు ఎక్కించిన ఘనత కూడా ఆయనదే.