: బాలసాయిబాబాపై శిష్యుడి కేసు!... హత్య చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ!


కర్నూలు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భగవాన్ శ్రీ బాలసాయిబాబాపై ఆయన శిష్యుడే కేసు పెట్టారు. ఇప్పటికే పలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్న బాలసాయిబాబాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సొంత శిష్యుడినే హత్య చేసేందుకు బాలసాయిబాబా యత్నిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకెళితే... కర్నూలు శివారులోని బాలసాయి ఆశ్రమంలో 13 ఏళ్ళుగా ఉంటూ వచ్చిన శివప్రసాద్ అనే వ్యక్తి బాలసాయికి ప్రధాన శిష్యుడిగా ఎదిగారు. ఈ క్రమంలో హైదరాబాదులోని సంస్థ ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతలు కూడా శివప్రసాద్ చేతిలోకే వెళ్లాయి. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే హైదరాబాదులోని ఆస్తులను విక్రయించేందుకు బాలసాయి యత్నిస్తున్నారట. ఈ యత్నాలను అడ్డుకున్న తనను చంపేసేందుకు బాలసాయి తన అనుచరులను పురమాయించారని శివప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా కర్నూలు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News