: రేపు సింగపూర్ పర్యటనకు కేటీఆర్!... మలేసియాలోనూ పర్యటించనున్న మంత్రి!
టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రేపు సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు. సింగపూర్ తో పాటు మలేసియాలోనూ ఆయన పర్యటిస్తారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో సింగపూర్, మలేసియా దేశాలకు చెందిన ప్రభుత్వాలు, పలు పారిశ్రామిక సంస్థలతో వాణిజ్య, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మలేసియా అధికారుల బృందం ఇటీవల తెలంగాణలో పర్యటించిన సందర్భంగా తమ దేశ పర్యటనకు రావాలని కేటీఆర్ ను ఆహ్వానించింది. ఆ ఆహ్వానం మేరకే కేటీఆర్ ఈ పర్యటనకు వెళుతున్నారు.