: నాంపల్లిలో టీ టీడీపీ ఇఫ్తార్ విందు... హాజరైన నారా లోకేశ్
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని తెలంగాణలోని ముస్లింలకు టీ టీడీపీ నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చింది. హైదరాబాదులోని నాంపల్లికి చెందిన రెడ్ రోజ్ పంక్షన్ హాల్ లో నిన్న రాత్రి జరిగిన ఈ విందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందు ఆరగించారు. ఈ కార్యక్రమానికి టీ టీడీపీ చీఫ్ ఎల్. రమణ, పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, నర్సారెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా హాజరయ్యారు.