: నేను టాపర్ కావాలని కోరుకోలేదు... మా నాన్న లంచాలిచ్చి మేనేజ్ చేశాడు: 'నకిలీ టాపర్' రూబీ రాయ్
బీహార్ ఇంటర్ బోర్డు నకిలీ టాపర్, 12వ తరగతి విద్యార్థిని రూబీ రాయ్ పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ‘పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో సెకండ్ డివిజన్ సాధిస్తే చాలనుకున్నాను. టాపర్ గా నిలవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు’ అని రూబీ రాయ్ చెప్పింది. ఈ సబ్జెక్టులో తనను టాపర్ గా చెయ్యాలనే తన తండ్రి అనుకున్నాడని, ఈ విషయమై తనకు ప్రామిస్ కూడా చేశారని చెప్పింది. అందుకని, ఇన్వెస్ట్ గేటర్లకు, ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి తన తండ్రి మేనేజ్ చేశారని రూబీ రాయ్ చెప్పినట్లు ఆమెను విచారించిన అధికారులు పేర్కొన్నారు.