: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటి ముట్టడి
ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటిని పీడీఎస్ యూ ముట్టడించింది. హన్మకొండ సుబేదారి నుంచి టీచర్స్ కాలనీలోని కడియం ఇంటికి పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో విద్యార్థులు ప్రతిఘటించి ముందుకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి, ధర్నాకు దిగారు. కొంతసమయం తర్వాత విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్లారు.