: బ్రిటన్ మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు
బ్రిటన్ సీనియర్ మహిళా మంత్రి జస్టిన్ గ్రీనింగ్ తాను స్వలింగ సంపర్కురాలినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తాను స్వలింగ సంపర్కురాలినని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని, స్వలింగ సంపర్కుల తరపున ప్రచారం చేస్తానని, వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందంటూ కన్జర్వేటివ్ కేబినెట్ కు చెందిన గ్రీనింగ్ తన ట్వీట్ లో పేర్కొంది. కాగా, గ్రీనింగ్ చేసిన ప్రకటనను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు.