: న్యాయాధికారుల తొలగింపుపై నిరసనల పర్వం.. న్యాయవాది ఆత్మహత్యాయత్నం


తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్య‌క్షుడు ర‌వీంద‌ర్‌రెడ్డి, జ‌నర‌ల్ సెక్ర‌ట‌రీ వ‌రప్ర‌సాద్‌లను తొలగిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై న్యాయవాదుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు వద్ద తిరుమల్ అనే న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ డబ్బాలో కిరోసిన్‌ను తీసుకొచ్చి తిరుమ‌ల్ త‌న‌ ఒంటిపై పోసుకున్నాడు. న్యాయ‌వాదిని అడ్డుకున్న పోలీసులు అత‌డ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించి, ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. హైకోర్టు, నాంప‌ల్లి కోర్టు వ‌ద్ద కూడా ఈరోజు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

  • Loading...

More Telugu News