: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రధాని మోదీ ఈరోజు ఆదేశించినట్లు తెలిసింది. బుధవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, ఏడో వేతన సంఘం అమల్లోకి వస్తే 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు.