: హిందూపురంలో బాలయ్య సందడి!... జనంతో కలిసి మొక్కలు నాటిన టీడీపీ ఎమ్మెల్యే


టాలీవుడ్ టాప్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం హిందూపురం చేరుకున్న బాలయ్య... ‘వనభారతి- జనహారతి’ పేరిట 'ఈనాడు-ఈటీవీ' నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు, తన తండ్రి నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడిగా ఎన్టీఆర్ ను బాలయ్య కీర్తించారు. పేదల కోసం నాడే కిలో బియ్యాన్ని రూ.2కు అందజేసిన ఘనత తన తండ్రికే దక్కిందన్నారు. రాయలసీమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీ-నీవా సుజల స్రవంతిని త్వరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లా తాగు, సాగు నీటి ఇబ్బందులకు చెక్ పెడతామని బాలయ్య ప్రకటించారు.

  • Loading...

More Telugu News