: చర్యలు తీసుకోవాల్సిందే.. ఎమ్మెల్యే వివేకానందగౌడ్ భవనం కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు
చింతల్ హైదర్‌గూడ ప్రాంతంలో ఉన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు చెందిన భవనం కూల్చివేతకు హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు ఉన్న అక్రమాస్తులపై హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అనంతరం హైకోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది. అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాల్సిందేనని వ్యాఖ్యానించింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ భవనాన్ని కూల్చివేయాలని, భవనంలో ఉన్న కార్పోరేట్ కళాశాలను ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.