: ఢిల్లీలో బిజీ బిజీగా కేటీఆర్‌


తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంత‌రం కేంద్ర‌మంత్రులు ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్, జేపీ న‌డ్డా, పలువురు అధికారుల‌ను ఆయన కలవనున్నారు. కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న ప‌లు అంశాల‌పై ఆయన కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న ద‌క్షిణ కొరియా, కెన‌డా, స్వీడ‌న్ దేశాల రాయ‌బారుల‌ను కూడా కేటీఆర్ ఈరోజు కలవనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News