: రెజ్లింగ్ రింగ్ లో భజ్జీ!.. ప్రొఫెషనల్ రెజ్లర్ ను మట్టి కరిపించిన క్రికెటర్!


కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (సీడబ్ల్యూఏ) పేరిట ఢిల్లీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న హర్యానాకు చెందిన ఓ సాధారణ మహిళ పంజాబీ డ్రెస్ లో రెజ్లింగ్ రింగ్ లోకి దిగి ప్రొఫెషనల్ రెజ్లర్ ను మట్టి కరిపించిన వైనం మనకు తెలిసిందే. తాజాగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఆమెలానే రెజ్లింగ్ రింగ్ లో సత్తా చాటాడు. రెజ్లర్ కంటే ముందుగానే రింగ్ లోకి దూరి నిలబడ్డ భజ్జీ... తనపై రెజ్లర్ పంచ్ విసరగానే చాకచక్యంగా తప్పించుకున్నాడు. తన పంచ్ మిస్సైందన్న షాక్ నుంచి సదరు ప్రొఫెషనల్ తేరుకునేలోగానే భజ్జీ ఊహించని విధంగా పంచ్ విసిరాడు. దీంతో కండలు తిరిగిన శరీరంతో ఉన్న సదరు రెజ్లర్... భజ్జీ దెబ్బకు కిందపడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News