: తెలంగాణకు అతి భారీ వర్షసూచన


తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ‌లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొన్నారు. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News