: తెలంగాణలో పెంచిన ఛార్జీలకు నిరసనగా ప్రతిపక్షాల ధర్నా
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై ప్రతిపక్షపార్టీల నేతలు నిప్పులు చెరిగారు. సామాన్యుడి బాధను అర్థం చేసుకోకుండా కేసీఆర్ సర్కార్ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను అమాంతం పెంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలకు నిరసనగా నల్గొండలో ప్రతిపక్షాలు ధర్నాకు దిగాయి. అక్కడి అద్దంకి-నార్కట్ పల్లి రహదారిపై టీడీపీ, బీజేపీ, వామపక్షాలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. కేసీఆర్ సామాన్యుడి గోడును అర్థం చేసుకునే స్థితిలో లేరని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.