: ఎయిర్ టెల్ నెట్ వర్క్ యాప్... లోపాలెన్నో!


ఇండియాలో నెంబర్ వన్ మొబైల్ సేవల సంస్థ ఎయిర్ టెల్, ఇటీవల ఓ కొత్త ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలుసుగా? అదే ఓపెన్ నెట్ వర్క్. నెట్ వర్క్ టవర్స్ ఎక్కడుంటాయో, వాటి సిగ్నల్ బలమెంతో వినియోగదారులకు తెలియజెప్పే యాప్ ఇది. అసలీ ఓపెన్ నెట్ వర్క్ యాప్, గూగుల్ ప్లే స్టోర్ లోని ఎయిర్ టెల్ కంపెనీల యాప్స్ గ్రూప్ లో అందుబాటులో లేదంటే నమ్ముతారా? ఇక మీరు 'ఓపెన్ నెట్ వర్క్' అని సెర్చ్ చేస్తే, కౌపెన్ యారీ అనే సంస్థ అభివృద్ధి చేసిన యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే, అదే ఎయిర్ టెల్ ఓపెన్ నెట్ వర్క్ యాప్ అవుతుంది. ఇక ఇంట్లో నాలుగు గోడల మధ్యా ఉన్నప్పుడు ఇది సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే లొకేషన్ ను జీపీఎస్ సరిగ్గా గుర్తించలేదు కాబట్టి. దీంతో ఇంట్లో సిగ్నల్ చూసుకోవాలంటే, పిన్ కోడ్ ను మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. ఆపై మంచి డేటా, వాయిస్ క్వాలిటీ ఉందని యాప్ చెబుతున్నా, కాల్స్ చేసేటప్పుడు సరిగ్గా వినపడక, ఇంటర్నెట్ సరిగ్గా రాక కస్టమర్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇక, ఎయిర్ టెల్ మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఎక్కడెక్కడ టవర్లు రావాలని కోరుతున్నారో ఈ యాప్ ద్వారా అడుగుతోంది. సిగ్నల్స్ లేని చోట్ల టవర్ కావాలని కోరేందుకు ప్రయత్నించిన పలువురు విఫలమయ్యారని తెలుస్తోంది. టవర్ల గురించి ఫిర్యాదు చేయాలని చూసిన వారికి నిరాశనే మిగుల్చుతూ, ఓ అడ్వయిజర్ తో మాట్లాడాలని ఎయిర్ టెల్ నుంచి చివరకు సమాధానం వస్తున్నట్టు సమాచారం. దీంతో నెట్ వర్క్ యాప్ తో పెద్దగా ఉపయోగమేమీ లేనట్టేనని వాడకందారులు పెదవి విరుస్తున్నారు.

  • Loading...

More Telugu News