: వైఎస్ జగన్ కు కొత్త రోగాన్ని ఆపాదించిన దేవినేని!... సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధి ఉందని ఎద్దేవా!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విచిత్రమైన వ్యాధి ఉందంటూ గతంలో సంచలన ఆరోపణ చేసిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిన్న మరోమారు ధ్వజమెత్తారు. సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధితో జగన్ బాధపడుతున్నారని ఆయన నిన్న ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడ్డానంటూ జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న విజయవాడలో మీడియా సమావేశం పెట్టిన సందర్భంగా దేవినేని ఈ ఆరోపణలు గుప్పించారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్... అదే కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటిచ్చినప్పుడే ఆ వ్యాధి బయటపడిందని కూడా దేవినేని అన్నారు. జగన్ 420 కావడం వల్లే తమపైనా 420 కేసులు పెట్టాలంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.