: పేరుకే ప్రొడక్షన్ హౌస్... లోపలంతా వ్యభిచారమే!: ముంబైలో మోడల్ అరెస్ట్!
ముంబై పోలీసులు నిన్న నగరంలోని వెర్సోరా ప్రాంతంలో 24 ఏళ్ల మోడల్ ను అరెస్ట్ చేశారు. మోడలింగ్ తో పాటు సినీ వినీలాకాశంలో మెరిసిపోదామంటూ వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న అమాయక యువతుల బలహీనతలనే లక్ష్యంగా చేసుకున్న ఆ మోడల్... ఏకంగా వ్యభిచార కూపాన్నే నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆ లేడీ మోడల్ ఏకంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా తెరచిందట. ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ మోడల్ నిర్వహిస్తున్న చీకటి వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న ఆమె కార్యాలయంపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఇద్దరు మైనర్ బాలికలను వారు వ్యభిచార కూపం నుంచి రక్షించారు. ఆ తర్వాత మోడల్ ను అరెస్ట్ చేశారు.