: వేతనంలో ‘టాప్’ లేపిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పూరి!


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన అసెట్ క్వాలిటీ రివ్యూతో చాలా ప్రైవేట్ బ్యాంకులకు చెందిన చీఫ్ ల వేతనాలు భారీగా తగ్గాయి. అయితే దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో సత్తా చాటుతున్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పూరి వేతనం మాత్రం పైపైకి దూసుకెళ్లింది. గతేడాది ఏకంగా 31 శాతం పెరుగుదలతో ఆయన వార్షిక వేతనం రూ.9.73 కోట్లకు చేరింది. వెరసి అత్యధిక వేతనం అందుకున్న ప్రైవేట్ బ్యాంక్ చీఫ్ గా పూరి రికార్డులకెక్కారు. ఇక యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ వేతన ప్యాకేజీ సైతం 28 శాతం పెరిగి రూ.5.50 కోట్లకు చేరడంతో ఆమె రెండో స్థానంలో నిలిచారు. ప్రైవేట్ బ్యాంకుల్లో అగ్రగామిగా ఎదిగిన ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చార్ వేతనంలో భారీ తరుగుదల నమోదైంది. గతేడాది ఆమె వేతనం రూ.4.79 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News