: ‘కబాలి’ పాట రిలీజు చేయడం ఎంతో సంతోషంగా ఉంది: పుల్లెల గోపీచంద్


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలోని పాటను ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ‘కబాలి’ ఆడియో రిలీజ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, రజనీకాంత్ కు తాను బిగ్ ఫ్యాన్ నని, గతంలో తాను చెన్నైలో ఉన్నప్పుడు రజనీ స్టైలే నడిచేదని అన్నారు. ఇంకా టి.సుబ్బరామిరెడ్డి, హీరో నాని, ఇతర సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News