: తిరుమలలో ఈదురు గాలులతో భారీ వర్షం... ఇబ్బందిపడుతున్న భక్తులు
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు జలమయమవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు అడుగుపెట్టేందుకు వీలు లేకపోవడంతో కొంతమంది భక్తులు గదుల్లో ఉండిపోయారు. కాగా, తక్షణ చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఆలయ సిబ్బంది ఉన్నారు.