: ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీల మూకుమ్మడి రాజీనామాలు


ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీలు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడికి ఇచ్చారు. గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకని హైదరాబాద్ లోని గన్ పార్క్ నుంచి ర్యాలీగా రాజ్ భవన్ వద్దకు వారు బయలుదేరారు. అంతకుముందు అమరవీరుల స్థూపానికి న్యాయాధికారులు నివాళులర్పించారు. ఈ ర్యాలీ దృష్ట్యా రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News