: దేవినేని ఉమకు చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచినట్టుంది: వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్


ఏపీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవినేని ఉమకు చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచినట్టుంది, అందుకే, అమావాస్య, పౌర్ణమినాడు ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చుక్క నీరు కూడా కృష్ణా డెల్టాకు రాలేదని, డబ్బులు దండుకోవడానికి ఈ ప్రాజెక్టును కట్టారని అన్నారు. జూన్ లో కృష్ణా డెల్టాకు నీరిస్తామన్న టీడీపీ నేతల మాటలు ఏమయ్యాయని జోగి రమేష్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News