: 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, రాసిన వారందరికీ సున్నా మార్కులు... మొత్తుకుంటున్న రాజస్థాన్ విద్యార్థులు!


ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నాపత్రం ఉండగా, ఎవరూ ఊహించని రీతిలో రాసిన వారందరికీ సున్నా మార్కులు వచ్చాయి. ఈ ఘటన రాజస్థాన్ లోని ఓ ఐటీఐ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన వారి విషయంలో జరుగగా, ప్రాక్టికల్స్, థియరీ విభాగాల్లో అందరికీ సున్నా మార్కులే వచ్చాయి. దీంతో విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్నారు. అందరికీ సున్నా మార్కులు రావడమేంటని ప్రశ్నిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్, జోథ్ పూర్ లోని నేషనల్ కౌన్సిల్ ఫర్ వోకేషనల్ ట్రైనింగ్ వర్శిటీలోనే తప్పు జరిగిందని వ్యాఖ్యానించారు. ఫలితాలను సరిచూడాలని లేఖ రాశామని తెలిపారు. తదుపరి సెమిస్టర్ కు ఫీజులు చెల్లిస్తే, సున్నా మార్కులను అంగీకరించినట్లవుతుందని, చెల్లించకుంటే విద్యార్థులు ఓ విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు త్వరితగతిన స్పందించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News