: తాలిబాన్ నేత ముల్హా జన్నత్ సహా 16 మందిని మట్టుబెట్టిన అమెరికా
ఆఫ్గనిస్థాన్ లో తాలిబాన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుంద్ ప్రావిన్స్ లో అమెరికా సైన్యం జరిపిన మానవ రహిత విమానాల దాడుల్లో తాలిబాన్ల సీనియర్ నేత ముల్హా జన్నత్ గుల్ సహా 16 మంది హతమయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్గన్ సైన్యాధికారులు నేడు తెలియజేశారు. శనివారం రాత్రి ఈ దాడులు జరిగాయని, తాలిబాన్లు ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై డ్రోన్లు బాంబులను కురిపించాయని తెలిపారు. తాలిబాన్ల కదలికలపై స్పష్టమైన సమాచారం అందుకున్న అమెరికా సైన్యం డ్రోన్లను పంపిందని వివరించారు.