: శ్రీరాముడి కోసం చట్ట సవరణ: ప్రవీణ్ తొగాడియా


అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరిస్తుందన్న నమ్మకం తనకుందని విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. "పార్లమెంటులో చట్ట సవరణ జరుగుతుందన్న నమ్మకం పెరిగింది. వచ్చే మూడేళ్లలో ఇది జరగవచ్చు. కేవలం చట్ట సవరణ ద్వారానే శ్రీరాముడికి మందిర నిర్మాణం సాధ్యం. కోర్టు ఆదేశాలు, చర్చల ద్వారా నిర్మాణం అసాధ్యం" అని ఆయన అన్నారు. పాట్నాలో జరుగుతున్న మూడు రోజుల వీహెచ్పీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, బీజేపీ కల్పించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యూపీలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఇలా మరోసారి రామమందిర నిర్మాణ డిమాండ్ చేస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. దేశంలోని పలు ప్రాంతాల్లో హిందువులు వలస వెళ్లే పరిస్థితులు నెలకొని వుండటం ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News