: సరిహద్దు పర్వత ప్రాంతాల్లోని సైనికుల కోసం అమెరికా నుంచి హోవిట్జర్ గన్స్ కొన్న భారత్


భారత్, చైనా సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో సైనిక అవసరాలను తీర్చేలా 145 తేలికపాటి హోవిట్జర్ గన్స్ ను అమెరికా నుంచి ఇండియా కొనుగోలు చేసింది. వీటిని హెలికాప్టర్లలో సైతం సులువుగా తరలించవచ్చని, తేలికగా ఉండి, శత్రువులపై నిప్పులు కురిపిస్తాయని అధికారులు వివరించారు. ఈ డీల్ కు సంబంధించి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని, దీని విలువ 750 మిలియన్ డాలర్లని అధికారులు తెలిపారు. భారత్ కు సంబంధించినంత వరకూ పర్వతాల్లో యుద్ధం కోసం ఆయుధాల కొనుగోలులో ఇదే అతిపెద్ద డీల్ గా వెల్లడించారు. అమెరికా గన్ తయారీ సంస్థ బీఏఈ వీటిని అందిస్తుందని వివరించారు. తొలుత వాడకానికి సిద్ధంగా ఉన్న 25 గన్స్ ను బీఏఈ అందిస్తుందని, మిగిలినవి మహీంద్రా ప్లాంటులో విడిభాగాలను అతికించి తయారు చేస్తామని వెల్లడించారు. 1987 నుంచి వాడకంలో ఉన్న బోఫోర్స్ గన్స్ ను హోవిట్జర్లతో రీప్లేస్ చేయనున్నామని అధికారులు తెలిపారు. వీటితో పాటు ధనుష్ పేరిట తయారు చేస్తున్న 155 ఎంఎం 45 కాలిబర్ గన్స్ నెలాఖరు నుంచి సైన్యం అమ్ములపొదిలోకి చేరనున్నాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News