: హాంకాంగ్ చేరుకున్న చంద్రబాబు బృందం... నెలాఖరు వరకూ అక్కడే


నవ్యాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం ఈ తెల్లవారుఝామున హాంకాంగ్ చేరుకుంది. గత రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు బృందం అక్కడి నుంచి అర్ధరాత్రి హాంకాంగ్ కు బయలుదేరి వెళ్లింది. 30వ తేదీ వరకూ అక్కడే పర్యటించనున్న చంద్రబాబు, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, షిప్పింగ్, ఏవియేషన్, ఎనర్జీ, ఆక్వా రంగాలకు చెందిన కార్పొరేట్ కంపెనీలతో సమావేశమై, నూతన పెట్టుబడులపై చర్చించనున్నారు. చైనా పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణలతో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News