: కేసీఆర్ కి వాట్సప్ మెసేజ్ వచ్చినా... మమ్మల్ని పరిగెత్తించి పనులు చేయిస్తున్నారు: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాట్సప్ లో ఏ మెసెజ్ వచ్చినా, తమను పరిగెత్తించి పనులు చేయిస్తున్నారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలను అమలు చేసిన చరిత్ర కేసీఆర్ ది అని, 29 రాష్ట్రాల ప్రజలు 'బెస్ట్ సీఎం కేసీఆర్' అంటూ అభినందించారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తమ ప్రభుత్వంపై బురదజల్లాలనుకుంటే ఎవరికైనా సమాధానం చెబుతామన్నారు. మల్లన్న సాగర్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హరీష్ రావు అన్నారు.